ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసారు. తల్లి మరణవార్త తెలుసుకున్న ప్రధాని మోదీ గాంధీనగర్ లోని నివాసానికి వచ్చి, తల్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం తల్లి అంతిమయాత్రలో పాల్గొన్న మోదీ మాతృమూర్తి పాడెను మోసారు.