ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ అరాచక పాలనకు స్వప్తి చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 10:44 AM

వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బనలో విజయంతో తెలుగు దేశం జెండాను ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. నగరంలోని 14, 15వ డివిజన్లల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా డివిజన్లల్లో స్థానిక నాయకులతో కలిసి ప్రభాకర్‌ చౌదరి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. వైసీపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా భారాలు మోపడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కమలానగర్‌లోని వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి, వారిని ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా అనంత అర్బనలో అభివృద్ది పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పా ప్రస్తుతం ఏమి లేవన్నారు. 6వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉంటే వైసీపీ పాలకులు ఆపేసి లబ్ధిదారులకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టాలన్నా, అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నా టీడీపీతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి, వైసీపీ అరాచక పాలనకు స్వప్తి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న, టీడీపీ నాయకులు తలారి ఆదినారాయణ, దేవళ్లమురళి, డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, మారుతీకుమార్‌ గౌడ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, రాజారావు, దళవాయి వెంకటనారాయణ, పెద్దమారెప్ప పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com