జి. సిగడాం మండలంలోని నడిమివలసకు చెందిన బాలి రాజేష్ (25) కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాజేష్ ట్రాక్టర్ డ్రైవర్ కొద్ది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 27న రాత్రి ఎస్. పి. ఆర్. పురం సమీపంలో ఇటుక బట్టీ వద్ద పురుగుల మందు తాగి తండ్రి లక్ష్మణరావుకు ఫోన్ లో సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో రాజాం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్ కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ కె. రామకృష్ణ తెలిపారు.