ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఆందోళనలు 100వ రోజుకి చేరుకున్నాయి. ఈ ఆందోళలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా 400కుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే పలువురికి మరణశిక్ష అమలు చేయగా, ఆందోళనల కారణంగా పోలీసుల కస్టడీలో ఉన్నవారిలో ఇప్పటివరకు 100 మంది మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఇరాన్ మానవ హక్కుల సంస్థ (IHR) తాజా నివేదికలో వెల్లడించింది.