ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని రాష్ట్రపురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెం 1వ గ్రామసచివాలయంలోఆధార్ అప్డేట్ కేంద్రాన్ని మంత్రి సురేష్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ప్రజలు ఈ సేవలను సద్విని యోగం చేసుకోవచ్చన్నారు. నియోజక వర్గంలోని 17 గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు ప్రారంభమయ్యాయన్నారు. కార్య క్రమంలో డీఎల్డీవో సాయికుమార్, ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ డి కిరణ్‌గౌడ్, జడ్పీటీసీ సభ్యుడు చేదూరి విజయ భాస్కర్, సర్పంచి ఆర్ అరుణాబాయ్,పంచాయతి కార్యదర్శి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.