ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా? ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో అత్యధికంగా సంపాదించిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 16 సీజన్లకు కలిపి హిట్ మ్యాన్ రూ.178.6 కోట్లు వేతనంగా పొందాడు. మహేంద్రసింగ్ ధోనీ రూ.176.84 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(రూ.173.2 కోట్లు), సురేశ్ రైనా(రూ.110 కోట్లు), జడేజా(రూ.109 కోట్లు), సునీల్ నరైన్(రూ.107.2 కోట్లు), డివిలియర్స్(రూ.102.5 కోట్లు), గంభీర్(రూ.94.62 కోట్లు) ఉన్నారు.