లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. గురువారం పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం చిరంజీవులు మాట్లాడుతూ... లోకేష్ చేపట్టే పాదయాత్రకు యువగళం పేరు పెట్టారని, రాష్ట్రంలో వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పూర్తి మద్దతు అందించా లని కోరారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వం మొండిగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం మెడలు వంచి ఆ పరీక్షలు రద్దు చేయించిన ఘనత లోకేష్‌కే దక్కుతుందని అన్నారు. లోకేష్ పాదయాత్ర జనవరి 27న కుప్పాం నుంచి ప్రారంభమై 400రోజులు 4వేల కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ 9686296862 నెంబర్‌కు నాయకులు మిస్డ్ కాల్‌ను ఇచ్చారు. ఇటీవల చంద్రబాబు సభలో జరిగిన విషాధ ఘటనలో మృతిచెందిన కార్యక ర్తల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్ర మంలో మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, టీడీపీ నాయకులు జి.రవికుమార్, బోను దేవీచంద్రమౌళి, గౌరునాయుడు, జీవీ నాయుడు, కేజే నాయుడు, రామారావు పాల్గొన్నారు.