ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకు సహకరించాయి. ఉదయం సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 61,291 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 18,238 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.