మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయి ఆలయానికి ఈ ఏడాది భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.394 కోట్ల 28 లక్షల విరాళాలు వచ్చాయని, ఈ నెలాఖరు వరకు రూ.400 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 25.578 కిలోల బంగారం, 326.38 కిలో గ్రాముల వెండి కానుకలు సైతం ఉన్నాయి. అయితే సాయి సంస్థాన్ కు చెందిన విదేశీ మారకద్రవ్య ఖాతా లైసెన్స్ పునరుద్ధరణ పెండింగ్ లో ఉన్నందున ఈసారి విదేశీ చందాలు రాలేదని అధికారులు తెలిపారు.