కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆస్తుల విషయంలో గతంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా కేరళ త్రిస్సూర్ జిల్లాలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి సైతం వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఆలయానికి ఆయా బ్యాంకుల్లో రూ.1,737 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. 271 ఎకరాల భూములున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గురువాయూర్ కు చెందిన స్వామి భక్తుడు ఎం.కె.హరిదాస్ దాఖలు చేసిన స.హ చట్టం అప్లికేషన్ కు ఈ మేరకు సమాధానం వచ్చింది.