ఉక్రెయిన్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ ను బెలారస్ కూల్చేసింది. ఈ అంశంలో ఉక్రెయిన్ అంబాసిడర్ కు బెలారస్ సమన్లు కూడా జారీ చేసింది. ఓ నిర్జన ప్రదేశంలో ఆ క్షిపణి శిథిలాలు పడి ఉన్న దృశ్యాలను స్థానిక టీవీల్లో ప్రసారం చేశారు. రష్యా మిత్ర దేశమైన బెలారస్ ఈ ఘటన పట్ల ఆగ్రహంగా ఉంది. ఎస్-300 రాకెట్ కు సంబంధించిన పూర్తి విచారణ చేపట్టాలని బెలారస్ ఆ దేశాన్ని కోరింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత తొలిసారి మిస్సైల్ ను బెలారస్ కూల్చేసింది.