యజమాని ఇంట్లో ఓ పనిమనిషి భారీ చోరీకి పాల్పడింది. భర్తతో కలిసి బాత్ రూం కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి ప్రవేశించింది. పూణేలోని కల్యాణి నగర్ కుమార్ సిటీలో డిసెంబర్ 26, 27 మధ్యన ఈ ఘటన జరిగింది. దాదాపు రూ.47 లక్షలు విలువైన నగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పనిమనిషి ఊర్మిల హర్గే, ఆమె భర్త రాజ్ పాల్ హర్గెను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.27 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.