కొత్త సంవత్సరం ఆగమనం సందర్భంగా ఈనెల31న శనివారం రాత్రి పోలీస్ ఆంక్షలు అమలవుతాయని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) లోని స్పందన హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 31న రాత్రి ఎస్పీ నుంచి హోంగార్డు వరకు అందరూ విధుల్లో ఉంటారని చెప్పారు. జిల్లాను సెక్టార్లుగా విభజించి, నలుగురు ఏఎస్పీ లకు బాధ్యతలు అప్పగిస్తామని వివరించారు. వాహన తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.