చేబ్రోలు లోని వైయస్సార్ కళా ప్రాంగణంలో శుక్రవారం గ్రామ వార్డు సచివాలయ కన్వీనర్ల, వాలంటీర్ల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య పాల్గొని మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కన్వీనర్లు, సచివాలయ వాలంటీర్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లు గ్రామ సచివాలయ కన్వీనర్లకు సూచనలు, సలహాలు విధివిధానాలను సమావేశంలో వివరించారు.