మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. ఆ దేశ సైనిక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దీంతో ఆమెకు వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష మొత్తం 33 ఏళ్లకు చేరుకుంది. 2021 ఫిబ్రవరిలో ఆ దేశ సైన్యం.. ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆంగ్ సాన్ సూకీ హౌజ్ అరెస్టులో ఉన్నారు. మొత్తం 19 అభియోగాలపై ఆమె 18 నెలలు విచారణలు ఎదుర్కొన్నారు. అయితే, సూకీని రిలీజ్ చేయాలని ఇటీవల యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓ ప్రకటనలో కోరింది.