యాదవల సమస్యల పరిష్కరించడం కొరకు, శుక్రవారం చోడవరం పట్టణానికి విచ్చేసిన, హైకోర్టు న్యాయవాది గోలగాని అప్పారావు యాదవ్ కు, చోడవరం పట్టణ యాదవ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యాదవులకు విద్యా ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాధాన్యతను, ఇవ్వాలని అలాగే బలమైన సామాజిక వర్గాలను బీసీ-డి లో కలపడంతో యాదవులు నష్టపోతున్నారని కావున ప్రభుత్వం వారు పునరాలోచించి యాదవులకు న్యాయం చేయాలనీ కోరుతున్నామన్నారు. యాదవుల పై దాడులు చేస్తే, ఎంతటి వారికీ అయిన శిక్షించక తప్పదు అన్నారు. యాదవులందరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, అయన కోరారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ యువసేన సభ్యులు, హైకోర్టు న్యాయవాది అప్పారావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.