ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాకవరపాలెంలో 500 కోట్ల రూపాయలతో నిర్మించబోయే వైద్య కళాశాలకు శుక్రవారం నర్సీపట్నం మండలం జోగునాథునిపాలెం వద్ద శంకుస్థాపన చేశారు. అలాగే 450 కోట్లతో ఏలేరు కాలువతో తాండవ రిజర్వాయర్ ను అనుసంధానం చేసే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని అన్నారు. అలాగే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 450కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గత పాలకులు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఇన్ చార్జ్ మంత్రి విడదల రజనీ, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు.