అనంతగిరి మండలంలో కొండీబ పంచాయితీ కేంద్రంలో మంచినీటి సమస్య రోజురోజుకీ మరింత ఆందోళన చెందిస్తుంది. గ్రామంలో సుమారు 120 కుటుంబాలు ఆరువందలకు పైచిలుకు జనాభా కలిగి ఉన్నారు. కానీ తరచూ మంచినీటి సమస్యపై బాధపడుతూ ఉండటం గమనార్హం. ఇటీవల గ్రామం లో సందర్శించిన బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి రాజు ప్రత్యక్షంగా మంచినీటి సమస్యను గమనించారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్న నేటికి నీటి సమస్య నివారించకపోవడం ప్రభుత్వం సమస్యల మీద దృష్టి పెట్టె ఫలితం ఎంతవరకు ఉందో అద్దం పట్టినట్టు చూపిస్తుందని అన్నారు.
మంచినీటి తీవ్రత అధికంగా ఉన్నాగాని నేటికీ నీటి ఎద్దడి నివారణ లేకపోవడం గమనార్హం అన్నారు. ఎప్పుడూ గడపగడపకు వంటి కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్న నేతలు నేరుగా సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. నవరత్నాలు పేరుతో కాలక్షేపం చేస్తూ నాలుగేళ్లుగా ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం కొసమెరుపు అంటూ తెలియజేశారు. ఇలాగే సమస్యల మీద దృష్టి పెట్టకుండా కాలక్షేపం చేస్తే రానున్న రోజుల్లో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అసమర్థత పాలనకు గుణపాఠం చెబుతామని అనంతగిరి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి శెట్టి రాజు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.