ఆత్మకూరు ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరుగుతున్న నాడు - నేడు పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విద్యా కమిటీ సభ్యులు ఆరోపిస్తూ.. పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రధాన ఉపాధ్యాయుడు, విద్యా కమిటీ ఛైర్మన్లు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు. నాడు-నేడు అక్రమాలను ప్రశ్నించినందుకు కమిటీ నుంచి వైస్ ఛైర్మన్‌ను, సభ్యులను తొలగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల పనులను సమీక్షించాలని కమిటీ సభ్యులు మీడియా ద్వారా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa