దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బిన్ స్వర్గస్తులైన సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మండల పార్టీ అధ్యక్షులు మాదాల సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆత్కూరి రామయ్య, బాదరయ్యా గౌడ్, సింగా ప్రసాద్, ప్రతాప్ రెడ్డి, నాగ చారి, పుల్లల చెరువు మండల అధ్యక్షుడు భీమనబోయిన ఆదినారాయణ, త్రిపురాంతకం మండలం అధ్యక్షులు వీరాంజయాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa