శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శనివారం నాడు మంచు భారీగా అలుముకుంది. ఉదయం 9 గంటలకు సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మంచు విపరీతంగా ఉంది. జనవరి నెల సమీపించడంతో మంచు ఎక్కువుగా నమోదు అవుతుంది. దీంతో రహదారులపై దగ్గరకు వచ్చే వరకూ వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.