ప్రపంచ బ్లిట్జ్ టోర్నీ చరిత్రలో తెలుగమ్మాయి చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో మెుదటి రోజు పోటీల్లో 9 రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉన్న ఆమె, 17 రౌండ్ల తర్వాత 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి అయిదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన ఆమె, చివరి 12 రౌండ్లలో ఒక్క పరాజయం లేకుండా పోడియం ఎక్కడం విశేషం. ఈ క్రమంలో చివరి రౌండ్లో టాన్ జాంగ్‌యీపై గెలిచి రజతం నెగ్గింది. అర పాయింట్ తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకుంది. దిగ్గజ ఆటగాడు ఆనంద్ (2017) తర్వాత ఈ టోర్నీలో పతకం సాధించిన ఘనత హంపిదే.