జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఇంటి ప్రహారీని అధికారులు నేలమట్టం చేశారు. అనంతనాగ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంటిగోడను జేసీబీతో కూల్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కశ్మీర్ ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదిని గులాం నబీ ఖాన్‌గా గుర్తించారు. ఈ ప్రహరీని గోడను అక్రమంగా నిర్మించాడని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమమించుకున్నాడని అధికారులు చెప్పారు.