ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని శ్రీశైలం ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. శనివారం వెలుగోడు పట్టణంలోని సిపి నగర్ లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గత మూడేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయ పాల్, ఎంపిపి లాలం రమేష్, అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులున్నారు.