ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలోని వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, జిల్లా కలెక్టరేట్లలో యోగివేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాల నిర్వహణకు విధానాలు రూపొందించి అన్ని శాఖలకు పంపించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖను ఆదేశించింది.