మన పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తుంది. దీంతో గ్యాస్ ను బెలూన్లలో నిలుపుతున్నారు. ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్సులోని ప్రజలు సిలిండర్ల కొరతతో ప్లాస్టిక్ సంచుల్లోనే గ్యాసును తీసుకెళ్తున్నారు. గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌కు అనుసంధానించబడిన దుకాణాల లోపల సంచులను నింపడం ద్వారా గ్యాస్ విక్రయిస్తున్నారు. చిన్న విద్యుత్ పంపు సహాయంతో ఈ గ్యాస్ ను వంటగదిలో ఉపయోగిస్తారు. ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేకపోతుంది.