ప్రపంచ దేశాల్ని మరోసారి కొవిడ్ మహమ్మారి వెంటాడుతుంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా 19 ఏళ్లలోపు వారిలో 50 నుంచి 70% మంది కరోనా వైరస్ బారిన పడే ముప్పును ఎదుర్కొన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్త నమూనాలను పరిశీలిస్తే కొవిడ్ తొలి ఉద్ధృతిలో 7.3% మంది కరోనా బారిన పడితే ఆరో వేవ్‌కి వచ్చేసరికి అది 56.6 శాతానికి చేరిందని గుర్తించారు.