వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 285 దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరిగాయని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు. ఇప్పటిదాకా ఏ ఒక్క సంఘటనలోనూ దోషులను పట్టుకోలేదని కళా వెంకట్రావు పేర్కొన్నారు. ఇలా ఏపీలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. గత మూడున్నరేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇదిలావుంటే కళా వెంకట్రావు నివాసంలో ఇవాళ నూతన సంవత్సరాది వేడుకలు జరిగాయి. కళా వెంకట్రావుకు పుష్పగుచ్ఛాలు అందించి పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు.