దేశంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకీ పెచ్చుమీరుతున్నాయి. మహిళలపై దాడులకు సంబంధించి 2022లో దాదాపుగా 31 వేల ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. 2021లో 30,864 ఫిర్యాదులు అందితే , తర్వాత ఏడాదికి స్వల్పంగా పెరిగి 30,957 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినవే 9,710 ఫిర్యాదులు ఉన్నాయని గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత గృహ హింసకు సంబంధించి 6,970 కేసులు, వరకట్నం వేధింపులు 4,600 ఫిర్యాదులు అందాయి.