పొరుగుదేశం పాకిస్తాన్ డ్రోన్ లతో తరచుగా భారత సైన్యాన్ని కవ్విస్తోంది. తాజాగా పంజాబ్ గురుదాస్ పూర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ వైపు నుండి ఓ డ్రోన్ ప్రవేశించింది. దీన్ని గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లినట్లు బీఎస్ఎఫ్ డీజీ ప్రభాకర్ జోషి తెలిపారు. గత మూడు రోజుల్లో మూడు డ్రోన్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయని ఆయన వెల్లడించారు.