అనేక వైరస్‌లతో జీవకోటి విలవిల్లాడుతుంది. అటు మనుషులపై, మూగజీవులపై పంజా విసురుతున్నాయి. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ మూగజీవాల ప్రాణాలు తీస్తుంది. శోగనూరు గ్రామంలో ఇటీవల సుమారు 38 పశువులు చనిపోయాయి. దీంతో పాల ఉత్పత్తి కూడా తగ్గిపోటంతో పాటు రైతుల ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు.