‘ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది, గుంటూరు పట్టణంలో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో!’ టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ కారణంగా ప్రజల ప్రాణాలు బలిఅవుతున్నాయి. టీడీపీ సభల్లో చంద్రబాబు, టీడీపీ సభ నిర్వాహకుల నిర్లక్ష్యంగా కారణంగా గడిచిన 5 రోజుల్లో 11 మంది మృతిచెందారు అని పేర్ని నాని ఘాటుగా కామెంట్స్ చేశారు.