టీడీపీ సభల్లో అమాయక ప్రజల ప్రాణాలు బలి అవుతున్నాయని, ఈ ప్రమాదాలకు చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు సభ ప్రమాదంపై అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న !’.. ‘నిన్న కందుకూరులో 8 మంది మృతి. నేడు గుంటూరులో ఇప్పటికి 3 మృతి. ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి !’ అని వ్యాఖ్యలు చేశారు.