టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పట్ల పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు చింతమనేని ఏలూరు ప్రభుత్వాస్పత్రి దగ్గరకు వచ్చారు. రేపు తన పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు చింతమనేని తన అనుచరులతో ఆస్పత్రికి వచ్చారు. అయితే హరిరామజోగయ్య ను పరామర్శించేందుకే ఆస్పత్రికి వచ్చారన్న అనుమానంతో లోపలకు వెళ్లకుండా గేటు దగ్గరే పోలీసులు నిలువరించి అనుచితంగా వ్యవహరించారు. దీంతో చింతమనేని వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విడిచిపెట్టారు. ఈ సంఘటనపై చింతమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ అమరావతి కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలియజేశారు. చిరిగిన చొక్కాతో నిరసన తెలియజేశారు. బర్త్ డే సందర్భంగా దెందులూరులో చింతమనేని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడంపై చింతమనేని ఫైరయ్యారు.