పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం తారకరామనగర్‌లో దాదాపు 50మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ... రాష్ట్రంలో జగన్ రెడ్డి అసమర్థ అస్తవ్యస్త పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని...అందుకు ఉదాహరణే వైసీపీని వీడి టీడీపీ చేరికలన్నారు. పార్టీ కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణ, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగరిక, ముత్యాలరావు, కాగితాల గోపి, బొబ్బర రాజు, దొడ్డపనేని ఆంజనేయులు, గుడిమెట్ల శేషారావు, ఏలూరు పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి నల్లూరి గోపికృష్ణ, ఐటిడిపి ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు శావిలి సుభాష్ చంద్రబోస్, ఆరెటి విరపండు, బిసి సెల్ మండల అధ్యక్షులు గంగుల నాగు, నిమ్మగడ్డ మహేష్, పసుమర్తి భీమేశ్వరరావు, బొబ్బర రమేష్, చొడే రామచంద్రం, తెలుగుమహిళా మండల ఉపాధ్యక్షురాలు పెండ్యాల రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.