గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. గుంటూరు ఘటనలో ముగ్గురు మృతి చెందడం బాధాకరం అని అన్నారు. పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు.