ఏలక్కాయను వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. నల్ల ఏలకులు సుగంధ పరిమళాన్ని కలిగిఉంటాయి, ఇది తలనొప్పిని కూడా నయం చేస్తుంది. గుండె సమస్యలు, శ్వాసకోశ వ్యాధులను, ముఖ్యంగా ఆస్తమాను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల క్షయ, బ్రోన్కైటిస్, ఆస్తమా మరియు కోరింత దగ్గుకు నల్ల ఏలకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కడుపులో ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపు సమస్యలు అదుపులోకి వస్తాయి. అజీర్తి సమస్యలను సైతం తొలగిస్తుంది.