తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న కారును వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన జనవరి 1న జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగకిరి నుండి సేలం వెళ్లే బైపాస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతిచెందగా, ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa