టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు బుధవారం నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు శాంతిపురం మండలం 121- పెద్దూరుకు చేరుకుంటారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.ఎ్‌స.మునిరత్నం తెలిపారు. 3 గంటలకు బెండనకుప్పం, 3.45 గంటలకు చెంగుబల్ల క్రాస్, 4 గంటలకు శివకురుబూరులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 5 గంటలకు శెట్టిబల్లలో పర్యటించి.. 6 గంటలకు కెనమాకులపల్లెలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆ కార్యక్రమం ముగిశాక 7 గంటలకు శాంతిపురంలో బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa