ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నిర్ణయాలు ప్రజాస్వామ్యానికే మచ్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 03:35 PM

ఏపీలో కొద్దిరోజులుపోతే ఎమర్జెన్సీ పెట్టినా ఆశ్చర్యం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్  ప్రతిపక్షాలను అణిచివేయడంలో ఇందిరా గాంధీ ని మించి పోవాలనుకుంటున్నారని విమర్శించారు. ఒక దురదృష్టకర సంఘటనను బూచిగా చూపించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. దీనిని బట్టి అధికార వైఎస్సార్సీపీకి ఓటమి భయం వెంటాడుతున్నదని అర్థం అవుతోందన్నారు. ఈ నిర్ణయాలు ప్రజాస్వామ్యానికే మచ్చ అని అన్నారు. గతంలో ఇలాంటి ఆంక్షలు ఉండి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు. అప్రజాస్వామిక చర్యలను బీజేపీ సహించదన్నారు. జగన్ పునరాలోచన చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని నాగోతు రమేష్ నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa