నల్లచెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని దేవరింటి పల్లి కుంట్ల వారి పల్లి మరియు ప్యాయల వారి పల్లి గ్రామాలలో జనవరి 4 వ తారీఖున జరిగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంని జయప్రదం చేయాలని నల్లచెరువు సర్పంచ్ పంచరత్నమ్మ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దారెడ్డి పాల్గొని గడప గడపను సందర్శించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయో లేదాని పర్యవేక్షిస్తారన్నారు.