తొండంగి మండలంలోని ఎర్రయ్య పేట, కొత్తపేట కుమ్మరిపేట గ్రామాలు మంగళవారం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తొండంగి మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడు హాజరై ఇంటింటికి తిరిగి వైకాపా ప్రభుత్వ అరాచక పాలన వివరించారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పేకేటి హరికృష్ణ, సురాడ రాంబాబు, కుమ్మరి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.