అదుపు తప్పి కారు పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారిపై తెలంగాణ వైపు నుంచి విజయవాడ వస్తున్న కారు జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావటంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa