రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. స్థానిక ఏఎంసీలోని పామర్రు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. మండలంలో ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు విషయం లో రైతులు ఎవ్వరు కూడా ఇబ్బందులు పడుకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంచులు, హమాలీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
రవాణాకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తేమ శాతం నమోదుకు అంగీకరిస్తే రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలని చెప్పారు. 21 రోజుల్లో ధాన్యం నగదు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందన్నారు. రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.