ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు శ్రీలంక ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిపేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 నుంచి 60 ఏళ్లకు కుదించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక ఆంక్షల నుంచి బయటపడేందుకు అనవసర ఖర్చులను సైతం తగ్గించుకుంటోంది. నియామకాలకు స్వస్తి చెప్పడమే కాకుండా పన్నులు, కరెంట్ ఛార్జీలను ఏ విధంగా తగ్గించుకోవాలో చూస్తోంది.