కోల్ కతాలోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి 11 నెలల చిన్నారిని కాపాడారు. ముర్షిదాబాద్ కు చెందిన 11 నెలల దీప్ దాస్ అనే చిన్నారి గత గురువారం పిల్లలతో ఆడుకుంటూ కింద పడిపోయాడు. తల్లి పరిశీలించగా కాలిలో బ్లేడ్ ముక్క కనిపించింది. వెంటనే చిన్నారి బ్లేడ్ మింగి ఉంటాడని భావించి ఆస్పత్రికి తరలించింది. వైద్యులు పరీక్షించగా కడుపులో బ్లేడ్ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో చిన్నారికి శస్త్రచికిత్స చేసి బ్లేడును బయటకు తీశారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నాడు.