భారత్ ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు. మహారాష్ట్ర నాగపూర్ లో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను ప్రధాని మంగళవారం ప్రారంభించారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్ సహా కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టుకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు.