ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ రాజు చార్లెస్-3తో ఫోన్ లో సంభాషించినట్లు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై ఇరువురూ చర్చించినట్లు వెల్లడించింది. దీంతో పాటు జీ20కి భారత్ అధ్యక్షత, మిషన్ లైఫ్ తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు పేర్కొంది. బ్రిటన్ రాజుగా చార్లెస్-3 నియమితులైన తర్వాత మోదీ తొలిసారిగా ఆయనతో మాట్లాడారు.