సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు, ఆనందం కనిపిస్తున్నాయని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. పెంచిన పెన్షన్లు పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..... గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్ళేటప్పుడు రూ. 2,750 పెన్షన్ మీ మనవడు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు అవ్వాతాతల కళ్ళలో ఆనందం, చిరునవ్వు చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. అంతేకాక వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలు అందిస్తున్నప్పుడు ప్రతి అక్కచెల్లెమ్మ మీ జగనన్న ఈ పథకాలు ఇస్తున్నారన్నప్పుడు కూడా వారి ముఖాల్లో చిరునవ్వు, ఆనందం కనిపిస్తున్నాయి. స్కూల్‌కి వెళ్ళే చిన్నారులు కూడా మా జగన్ మామ అభివృద్ది చేశారన్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది, మా అమ్మ ఖాతాలో కూడా రూ. 15 వేలు మా జగన్ మామ వేశారంటున్నప్పుడు చాలా ఆనందం వేసింది. అంగన్వాడీ సెంటర్లో కూడా చిన్నారులు మా జగన్ మామ మాకు పంపుతున్నారు ఇక్కడ మాకు పెడుతున్నారంటున్నారు అని తెలియజేసారు.