గుంటూరు తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, వైయస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేశారు. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.